రైతులతో బ్రాహ్మణి ముచ్చట
పూల తోట సాగు ఎలా ఉంది
మంగళగిరి – ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది ఏపీలో. రాష్ట్రంలోని మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణం ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు , మాజీ మంత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు.
ఆయనకు మద్దతుగా తన భార్య, హెరిటేజ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా క్యాంపెయిన్ తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. విస్తృతంగా పర్యటిస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్న మైందని అన్నారు.
ఈ సందర్బంగా మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి గ్రామంలో పర్యటించారు. ప్రజలతో ముచ్చటించారు. ఇదే సమయంలో పొలాల్లోకి వెళ్లారు. అక్కడ పూల తోటలో పని చేస్తున్న వారితో ముఖా ముఖి మాట్లాడారు.
తాము పవర్ లోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఆదాయ మార్గం చూపిస్తామన్నారు. నైపుణ్య అభివృద్దిపై ఫోకస్ పెడతామని హామీ ఇచ్చారు బ్రాహ్మణి నారా. ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు నాయుడు తమ కుటుంబ ఆస్తుల విలువ రూ. 980 కోట్లు అని ప్రకటించడం విస్తు పోయేలా చేసింది.