NEWSNATIONAL

దేశం మోదీని కోరుకుంటోంది

Share it with your family & friends

బీజేపీ చీఫ్ కె. అన్నామ‌లై

కేర‌ళ – భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మిళ‌నాడు చీఫ్ కె. అన్నామ‌లై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈసారి బీజేపీ అరుదైన చ‌రిత్ర సృష్టించ బోతోంద‌ని పేర్కొన్నారు. గ‌తంలో వ‌చ్చిన సీట్ల కంటే ఈసారి మ‌రిన్ని ఎక్కువ సీట్లు రాబోతున్నాయ‌ని తెలిపారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేర‌ళ లోని కొల్లంలో బీజేపీ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు.

దేశ ప్ర‌జ‌లంతా మూకుమ్మ‌డిగా ప్ర‌ధాన మంత్రిగా మ‌రోసారి న‌రేంద్ర మోదీని చూడాల‌ని అనుకుంటున్నార‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం, సుస్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని వారంతా ఆశిస్తున్నార‌ని ఈ రెండింటిని ఇచ్చే స‌త్తా ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీకే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు కే. అన్నామ‌లై కుప్పు స్వామి.

ద‌క్షిణాదిన బీజేపీ క్లీన్ స్వీప్ చేయ‌బోతోంద‌ని అన్నారు. కేర‌ళ‌లో ఎల్డీఎఫ్ ప‌ని అయి పోయింద‌న్నారు. ఇక్క‌డ కూడా తాము ప‌లు సీట్ల‌లో జెండా ఎగుర వేయ బోతున్నామ‌ని చెప్పారు బీజేపీ చీఫ్‌. యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు భార‌త్ వైపు చూస్తోంద‌న్న విష‌యం గుర్తించాల‌న్నారు .