SPORTS

పంజాబ్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌

Share it with your family & friends

గాడిన ప‌డిన గుజ‌రాత్ టైటాన్స్
ముల్తాన్ పూర్ – పంజాబ్ లోని ముల్తాన్ పూర్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2024 కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం సాధించింది. స్వంత మైదానంలో ఆశించిన దానికంటే ఎక్కువ స‌పోర్ట్ ల‌భించినా ఆదిలోనే వికెట్ల‌ను పారేసుకుంది ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్.

త‌క్కువ స్కోర్ కే క‌ట్ట‌డి చేయ‌డంలో గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్లు స‌క్సెస్ అయ్యారు. ల‌క్ష్యం చిన్న‌ది కావ‌డంతో గుజ‌రాత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ , రాహుల్ తెవాటియా కీల‌క పాత్ర పోషించారు. ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే సాయి కిషోర్ క‌ళ్లు చెదిరే బంతుల‌తో ప‌రేషాన్ చేశాడు. 4 ఓవ‌ర్ల‌లో 4 కీల‌క‌మైన వికెట్ల‌ను తీశాడు.

ఢిల్లీ చేతిలో ప‌రాజ‌యం పాలైన గుజ‌రాత్ ఎట్టకేల‌కు పంజాబ్ కింగ్స్ పై గెలుపుతో ఊపిరి పీల్చుకుంది. మొద‌ట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 142 ప‌రుగులు చేసింది. ప్ర‌భ్ సిమ్రాన్ ఒక్క‌డే మెరిశాడు. 21 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 35 ర‌న్స్ చేశాడు. ఒక్క‌డే టాప్ స్కోర‌ర్ కావ‌డం విశేషం.

143 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 17.1 ఓవ‌ర్ల‌లో టార్గెట్ పూర్తి చేసింది. తెవాటియా 18 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల‌తో 37 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిస్తే కెప్టెన్ గిల్ 29 బాల్స్ ఎదుర్కొని 5 ఫోర్ల‌తో 35 ర‌న్స్ చేశాడు.