కత్తుల కరచాలనం
అభిమానుల ఆనందం
కోల్ కతా – వాళ్లిద్దరూ మోస్ట్ పాపులర్ క్రికెటర్లు. ఒకరు గౌతం గంభీర్. ఆయన భారతీయ జనతా పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అంతే కాదు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ యజమానిగా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు హెడ్ కోచ్ మాత్రమే కాదు మెంటార్ గా పని చేస్తున్నాడు.
మరొకరు కింగ్ విరాట్ కోహ్లీ. జగమెరిగిన ఆటగాడు. ఒక రకంగా చెప్పాలంటే అతడికి ఉన్న మరో పేరు రన్ మెషీన్. వేల పరుగులు చేస్తూనే ఇంకా తనలో ఏ మాత్రం సత్తా తగ్గడం లేదని నిరూపిస్తూనే ఉన్నాడు. తన తోటి ఆటగాళ్లు వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టినా తను మాత్రం జట్టు స్కోర్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు కింగ్ కోహ్లీ.
ఇది పక్కన పెడితే కోల్ కతా లోని ప్రసిద్ద ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అరుదైన సన్నివేశానికి వేదికైంది. ఇద్దరూ భారత క్రికెట్ జట్టులో కలిసి ఆడినా ఆ మధ్యన ఎందుకనో వారి మధ్య బంధం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది.
కానీ ఈ మధ్యన ఇద్దరూ కలిసి మాట్లాడు కోవడం, సరదాగా పలకరించు కోవడం మామూలై పోయింది. కేకేఆర్ ఆర్సీబీ జట్ల మధ్య చివరి బంతి దాకా ఆసక్తికర పోరు సాగింది. చివరకు ఒక్క పరుగు తేడాతో కోల్ కతా విక్టరీ నమోదు చేసింది. ఈ సందర్బంగా మైదానంలో కోహ్లీ, గంభీర్ కలిసి కరచాలనం చేయడం కంట పడింది. ఇదే వైరల్ గా మారింది.