కావ్య మారన్ కళ కళ
దంచి కొడుతున్న హైద్రాబాద్
తమిళనాడు – మోస్ట్ వాంటెడ్ గర్ల్ గా పేరు పొందిన కావ్య మారన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులకు కావ్య పాప సుపరిచతం.
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ వస్తున్న ఏకైక వ్యక్తి కావ్య మారన్. తను సన్ నెట్ వర్క్ కు వారసురాలు. వేల కోట్ల ఆస్తులు ఆమె పేరు మీదే ఉన్నాయి. తను ఏరి కోరి సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఎంచుకుంది. దానిని చేజిక్కించుకుంది.
ఎప్పుడైతే ఎస్ ఆర్ హెచ్ ను టేకోవర్ చేసుకుందో ఆనాటి నుంచి నేటి దాకా పూర్తిగా సోషల్ మీడియాలో తానే ట్రెండ్ సెట్టర్ గా మారి పోయింది. కారణం ఆమె అందంతో పాటు తను ఎంజాయ్ చేసే విధానం క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ ను కూడా తన వైపు తిప్పుకునేలా చేసింది.
గత రెండు సీజన్లలో సన్ రైజర్స్ జట్టు పేలవమైన ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ తరుణంలో ఈ ఏడాది 2024లో మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ఆ జట్టు అద్బుతాలు సృష్టిస్తోంది. భారీ స్కోర్లు సాధిస్తూ తన రికార్డును తానే తిరగ రాస్తోంది. దీంతో కావ్య మారన్ సంతోషానికి అవధులు లేకుండా పోతోంది.