దేశంలో మార్పు తథ్యం
ప్రియాంక గాంధీ కామెంట్
ఛత్తీస్ గఢ్ – మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.
ఇవాళ దేశం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని , కానీ ప్రధాన మంత్రి మాత్రం తనకేమీ పట్టనట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు ప్రియాంక గాంధీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జూన్ 4 తర్వాత ఏమిటనేది మోదీకి తెలుస్తందన్నారు.
ప్రజల పక్షం వహించాల్సిన మీడియా ఇప్పుడు మోదీ జపం చేస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. వ్యవస్థలను మ్యానేజ్ చేయగలరు కానీ ప్రజలను మభ్య పెట్టడం ఎవరి తరం కాదన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన నిరాశలో ఉన్నారని ఇది దేశానికి మంచిది కాదన్నారు.
కేవలం కులం, మతం ఆధారంగా ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారంటూ మండిపడ్డారు ప్రియాంక గాంధీ. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. ఇకనైనా తప్పు తెలుసుకుని మోదీ మౌనంగా ఉంటే మంచిదన్నారు.