బీజేపీకి అంత సీన్ లేదు
శివసేన యూబీటీ నేత రౌత్
ముంబై – శివసేన (యుబీటీ) జాతీయ అధికార ప్రతినిధి , రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్నాయని అన్నారు. ప్రధానంగా మోదీకి ఈసారి బిగ్ షాక్ ఇవ్వడం ఖాయమన్నారు రౌత్.
ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి సత్తా చాటడం తప్పదన్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు గంప గుత్తగా తమ వైపు నిలబడతారన్న నమ్మకం తమకు ఉందన్నారు. ప్రధాన మంత్రి రేసులో రాహుల్ గాంధీ తో పాటు పలువురు తమ వారికి చెందిన వారు కూడా ఉండడంలో తప్పేమి ఉందని ప్రశ్నించారు సంజయ్ రౌత్.
రాహుల్ గాంధీ ఈ దేశానికి నాయకుడు ఇందులో సందేహం లేదన్నారు. ఆయన ప్రధాని కావాలని అనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇదే సమయంలో పీఎం రేసులో రాహుల్ తో పాటు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ , ఉద్దవ్ ఠాక్రే, మల్లికార్జున్ ఖర్గే లాంటి ఇతర నాయకులు కూడా ఉన్నారని స్పష్టం చేశారు. తమలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్నారు సంజయ్ రౌత్.