మద్యం షాపులు..బార్లు బంద్
సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ – మద్యం బాబులకు , ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. ఈనెల 23న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను భాగ్య నగరంలోని అన్ని వైన్స్ షాపులు, బార్లు బంద్ చేయాలని ఆదేశించారు.
ఎవరైనా రూల్స్ ను అతిక్రమించినా లేదా షాపులు, బార్లు తెరిచి ఉంచినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలో ఏ ఒక్క వైన్ షాపు కానీ లేదా బార్ కానీ తెరిచేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో మద్యం బాబులు బెంబేలెత్తి పోతున్నారు. ఇప్పటికే ఎండా కాలం కావడంతో మద్యాన్ని సేవిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాగు బోతులు ఒక్క నిమిషం కూడా తాగకుండా ఉండలేక పోతున్నారు.
హనుమాన్ జయంతి సందర్బంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని, మద్యం , బార్ల షాపుల యజమానులు సహకరించాలని లేక పోతే అరెస్ట్ లు తప్పవని హెచ్చరించారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి