SPORTS

చెస్ విజేత‌కు స్టాలిన్ కంగ్రాట్స్

Share it with your family & friends

వ‌ర‌ల్డ్ లో అతి పిన్న వ‌య‌స్సు

త‌మిళ‌నాడు – త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు చిన్న వ‌య‌సు లోనే వ‌ర‌ల్డ్ చెస్ టైటిల్ సాధించిన రాష్ట్రానికి చెందిన డి. గుకేష్ ను. సోమ‌వారం గుకేష్ తో పాటు త‌ల్లిదండ్రులు మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం కార్యాల‌యంలో క‌లిశారు. సీఎం తో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా ఉన్నారు. గుకేష్ కు శాలువా క‌ప్పి స‌న్మానించారు. ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి స‌హాయం కావాల‌న్నా అంద‌జేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు స్టాలిన్.

ఇదిలా ఉండ‌గా గుకేష్ . డి యువ చెస్ ఛాంపియ‌న్ గా నిలిచాడు. ఈ ఏడాది చైనాకు చెందిన డింగ్ లిరెన్ తో త‌ల‌ప‌డ‌నున్నాడు. అమెరికాకు చెందిన హికారు స‌క‌మురాతో జ‌రిగిన చివ‌రి రౌండ్ గేమ్ ను డ్రా చేసుకోవ‌డంతో 14 పాయింట్ల‌కు గాను 9 పాయింట్లు పొందాడు.

భార‌త దేశానికి చెందిన 17 ఏళ్ల గ్రాండ్ మాస్ట‌ర్ గుకేష్ దొమ్మ రాజు టొరంటోలో జ‌రిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేత‌గా నిలిచాడు. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ కోసం ఈ ఏడాది చివ‌ర‌లో చైనాకు చెందిన లిరెన్ తో పోటీ ప‌డ‌తాడు. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా అభినంద‌న‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ కె. అన్నామ‌లై కుప్పు స్వామి కూడా కంగ్రాట్స్ తెలిపారు గుకేష్ .