10వ తరగతి ఫలితాలు విడుదల
ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇప్పటి వరకు ప్రకటించిన విధంగానే రాష్ట్ర విద్యా శాఖ సోమవారం 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. పదవ తరగతి ఫలితాలలో 86.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలే పై చేయి సాధించడం విశేషం.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో 3,743 కేంద్రాలలో మొత్తం 6 లక్షల 16 వేల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 5, 34, 574 మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణత సాధించారు. అంతే కాకుండా ఏపీలోని 2,803 పాఠశాలలో 100 శాతం రిజల్ట్స్ రాగా 17 బడుల్లో సున్నా ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం.
ఇక విచిత్రం ఏమిటంటే ఈసారి పదో తరగతి ఫలితాల్లో జిల్లాల పరంగా చూస్తే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది మన్యం జిల్లా. ఇక కర్నూలు జిల్లా 62.47 శాతంతో ఆఖరి స్థానంలో ఉండడం ఒకింత ఆశ్చర్య పోయేలా చేసింది. ఫలితాలకు సంబంధించి ప్రభుత్వ విద్యా శాఖకు చెందిన వెబ్ సైట్ లో లభిస్తాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.
పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయ సాయి రెడ్డి.