ప్రజా సేవకే జీవితం అంకితం
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీ
వనపర్తి జిల్లా – తాను ఇంకా సర్వీసులో ఉన్నప్పటికీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని వనపర్తి జిల్లాలో పర్యటించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొత్త బండ రాయి పాకుల, రేవెల్లి గ్రామాల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో కలిసి ప్రచారంలో హోరెత్తించారు.
గుడిపల్లి రిజర్వాయర్ వద్ద ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆర్ఎస్పీ. తనకు ఓటు వేసి గెలిపించాలని, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల గొంతును పార్లమెంట్ లో వినిపిస్తానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆచరణకు నోచుకోని హామీలను గుప్పించిందని, ఆరు గ్యారెంటీల పేరుతో దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇకనైనా ప్రజలు వాస్తవాలను గుర్తించి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.