సర్కార్ ను కూల్చేందుకు కుట్ర
సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
నిజామాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్, దేశంలో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఇద్దరూ కలిసి తమ ప్రభుత్వాన్ని కూల్చే పనిలో పడ్డారంటూ ఆరోపించారు. కానీ వారి ఆటలు సాగవన్నారు.
తాను ఉన్నంత వరకు అలాంటిది జరగనీయని పేర్కొన్నారు. ప్రజలు తమకు ప్రజాస్వామ్య బద్దమైన పాలన కావాలని కాంగ్రెస్ పార్టీని ఏరికోరి ఎన్నుకున్నారని చెప్పారు. కానీ కావాలని కేసీఆర్ , మోదీ కలిసి బయట శత్రువులుగా నటిస్తూ లోపట తమ సర్కార్ ను కూల్చే పనిలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు.
ఇలాంటి చవకబారు రాజకీయాలు కేసీఆర్, మోదీ మానుకుంటే మంచిదన్నారు. ఇవాళ 400 సీట్లు కాదు కదా 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి బీజేపీకి లేదన్నారు. ఇకనైనా కేసీఆర్, మోదీ ఇలాంటి తప్పుడు ఆలోచనలు బంద్ చేయాలని సూచించారు. తమకే అధికారం కావాలని అనుకోవడం ఆశ తప్ప ఇంకేమీ కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అలా కూల్చే పని మొదలు పెడితే జనమే తన్ని తరిమే రోజు తప్పకుండా వస్తుందన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.