NEWSTELANGANA

రేవంత్ జైలుకు వెళ్ల‌డం ప‌క్కా

Share it with your family & friends

ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే, ఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ల‌డం ప‌క్కా అని పేర్కొన్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌కు కూడా తెలిసి పోయింద‌న్నారు. అందుకే ముంద‌స్తుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న‌ట్లు అనిపిస్తోంద‌న్నారు ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి.

పేరుకు ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం అనే పేరు త‌ప్పా న‌డిపిస్తున్న‌ది అంతా రేవంత్ రెడ్డేన‌ని పేర్కొన్నారు. ఎవ‌రైనా సీఎం అభ్య‌ర్థిని ఎంపిక చేసే ఛాన్స్ పార్టీకి ఉంటుంద‌న్నారు. కానీ విచిత్రం ఏమిటంటే ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి త‌న త‌ర్వాత సీఎంగా ఎన్నిక‌య్యే ఛాన్స్ ఒక్క కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి ఉంద‌ని అన్నారు.

ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి డైల‌మాలో ఉన్నాడ‌ని అన్నారు. నోటుకు ఓటు కేసుపై సుప్రీంకోర్టు తీర్పు చెప్ప‌నుంద‌న్నారు. జూలై 24 డెడ్ లైన్ పెట్టింద‌ని, ఈ కేసులో అడ్డంగా బుక్కైన రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి. ముంద‌స్తుగా వేరే వాళ్ల‌ను ఎందుకు అని అనుకున్నారో వెంక‌ట్ రెడ్డినే త‌న త‌ర్వాత సీఎం ప‌ద‌వికి అర్హుడంటూ చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది.