మల్లన్న సన్నిధిలో చంద్రబాబు
పూజలు చేసిన భువనేశ్వరి
కర్నూలు జిల్లా – దేశంలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది కర్నూలు జిల్లా లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం. శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునుడిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరితో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం చేపట్టారు.
వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు సాక్షి గణపతి, వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు వీరిద్దరూ. స్వామి, అమ్మ వార్ల దర్శనం అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. త్వరలోనే రాచరిక పాలన అంతం కాబోతోందన్నారు. టీడీపీ కూటమి ఆధ్వర్యంలో జనరంజకమైన ప్రజా పాలన రానుందన్నారు.
ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకు వస్తామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.