జగన్ ఆస్తులు రూ. 774.88 కోట్లు
ధనవంతుల సీఎంలలో తనే టాప్
అమరావతి – వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు మరింతగా పెరిగాయి. తను నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్ లో కీలక విషయాలు వెలుగు చూశాయి. గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ. 375 కోట్లుగా పేర్కొన్నారు సీఎం.
తాజాగా 2024వరకు వచ్చే సరికి ఐదేళ్లలో ఏకంగా రూ. 529.87 కోట్లకు అమాంతం పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. విచిత్రం ఏమిటంటే తన భార్య భారతీ రెడ్డి పేరుతో సిమెంట్ కంపెనీ కూడా ఉంది. ఇక ఆమెకు చెందిన ఆస్తులు 2019లో రూ. 124 కోట్లు ఉంటే 204లో రూ. 176.30 కోట్లకు పెరగడం గమనార్హం.
మొత్తంగా చూస్తే జగన్ రెడ్డి, భారతీ రెడ్డిల ఉమ్మడి ఆస్తుల విలువ రూ. 774.88 కోట్లు అన్నమాట. అంతే కాదు రూ. 5 కోట్ల విలువ చేసే ఆభరణాలు కూడా ఉన్నాయని తెలిపారు జగన్ రెడ్డి. ఇక జగన్ మోహన్ రెడ్డిపై ఒకటి కాదు ఏకంగా 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెయిల్ పై ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు కలిగి ఉన్నారు.
పలు కంపెనీలు కూడా ఆయన పేరుతో ఉన్నాయి. ఇక తన సోదరి వైఎస్ షర్మిల జగన్ రెడ్డికి రూ. 82 కోట్లు బాకీ పడినట్లు తెలిపింది.