NEWSTELANGANA

వామ్మో..కొండా ఆస్తులు రూ. 4568 కోట్లు

Share it with your family & friends

దేశంలోనే ధ‌నిక ఎంపీ అభ్య‌ర్థి

హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన చేవెళ్ల లోక్ స‌భ ఎంపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఆస్తులు ఆన‌కొండ‌ను మించి పోయాయి. ఏకంగా ఆయ‌న ఆస్తులు కోట్ల‌ల్లో అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే . ఏకంగా త‌న ఆస్తులు వేల కోట్ల‌ను దాటి పోయాయి.

సోమ‌వారం భారీ జ‌న సందోహం మ‌ధ్య అట్టాహాసంగా చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా త‌ను స‌మ‌ర్పించిన ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో విస్తు పోయే వాస్త‌వాలు వెల్ల‌డించారు. 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అత్యంత ధ‌నవంతుడైన ఎంపీ క్యాండిడేట్ గా అవ‌త‌రించారు.

ఆయ‌న మొత్తం ఆస్తుల విలువ రూ. 4,568 కోట్లుగా ప్ర‌కటించారు. అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, పిసిఆర్ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటాడెల్ ఆర్‌సెర్చ్, కుంకుమ సొల్యూషన్స్ తో పాటు ఇత‌ర‌ కంపెనీలలో షేర్లు ఉన్నాయి. కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఆస్తులు రూ. 1240 కోట్లు కాగా ఆయ‌న భార్య సంగీతా రెడ్డి ఆస్తులు రూ. 3,208 కోట్లు. కొడుకు ఆస్తుల విలువ రూ. 108 కోట్లు.

ఇక భార్య భ‌ర్త‌ల‌కు ఇద్ద‌రికీ క‌లిపి రూ. 11 కోట్ల విలువైన వ‌జ్రాలు , బంగారం క‌లిగి ఉన్నారు. పుప్పాలగూడలో రెండు విల్లాలు, చేవెళ్ల, రాజేంద్రనగర్ , చిత్తూరులో వ్యవసాయ భూములు ఉన్నాయి. అయితే కొండాపై నాలుగు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.