యశస్వి జైశ్వాల్ జోర్దార్
ముంబైకి యువ క్రికెటర్ షాక్
జైపూర్ – సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పూర్తిగా ఏక పక్షంగా సాగింది ఈ మ్యాచ్ . ముందు గా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది.
అనంతరం 180 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆడుతూ పాడుతూ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ విజయంతో ఆ జట్టు 7 మ్యాచ్ లలో గెలుపొంది 14 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ ఖరారు చేసుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ 2024 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ లలో ఆశించిన మేర రాణించ లేక పోయాడు యంగ్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్. కానీ ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరోసారి తన విశ్వ రూపాన్ని ప్రదర్శించాడు.
ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. జైశ్వాల్ 60 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 7 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 104 రన్స్ చేశాడు. దీంతో హార్దిక్ సేన చేతులెత్తేసింది. జైశ్వాల్ కు తోడు జోస్ బట్లర్ , సంజూ శాంసన్ పని పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు.