SPORTS

అబ్బా సందీప్ శ‌ర్మ దెబ్బ

Share it with your family & friends

ముంబై ఇండియ‌న్స్ విల‌విల

జైపూర్ – ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ పోరులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రాజ‌సాన్ని ప్ర‌ద‌ర్శించింది. ముంబై ఇండ‌యిన్స్ పై 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ న‌మోదు చేసింది. య‌శ‌స్వి జైశ్వాల్ సెంచ‌రీతో రెచ్చి పోతే బ‌ట్ల‌ర్, శాంస‌న్ బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో దుమ్ము రేపారు.

ఇక ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది రాజ‌స్థాన్ బౌల‌ర్ల గురించి . ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియ‌న్స్ ను త‌న అద్బుత‌మైన బౌలింగ్ తో క‌ట్ట‌డి చేశారు సందీప్ శ‌ర్మ‌, ట్రెంట్ బౌల్ట్. శ‌ర్మ దెబ్బ‌కు ముంబై ప్లేయ‌ర్లు విల విల లాడారు.

4 ఓవ‌ర్లు వేసిన సందీప్ శ‌ర్మ కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. ముంబై ప‌త‌నాన్ని శాసించాడు. త‌ను అనారోగ్యంతో ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు. కానీ అనుకోకుండా తిరిగి మైదానంలోకి వ‌చ్చాడు. వ‌చ్చీ రావ‌డంతోనే త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. మిస్సైల్ లాంటి బంతులు వేసి ఔరా అని పించేలా చేశాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును బెంబేలెత్తించాడు.

దీంతో మ్యాచ్ లో య‌శ‌స్వి సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నా ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును త‌క్కువ ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన సందీప్ శర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ద‌క్కింది.