పెమ్మసాని ఆస్తులు రూ. 4605 కోట్లు
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి రికార్డ్
అమరావతి – దేశంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీ అభ్యర్థులు ఇద్దరు సంచలనంగా మారారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు ఒకరు ఏపీకి చెందిన గుంటూరు లోక్ సభ అభ్యర్థిగా బరిలో నిలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కాగా మరొకరు తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల ఎంపీ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
ఈ ఇద్దరూ దేశంలోనే అత్యధిక ధనవంతుల ఎంపీలలో నెంబర్ 1, 2 గా నిలిచారు. చంద్రబాబు ఆస్తులు 980 కోట్లు కాగా , బాలకృష్ణ ఆస్తులు 280 కోట్లు , జగన్ రెడ్డి ఆస్తులు 778 కోట్లు ఇలా ఒకరిని మించిన మరొకరు ఆస్తులను వెల్లడించారు. తమ ఎన్నికల అఫిడవిట్లలో.
ఇక తాజాగా గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల మొత్తం విలువ రూ. 4605 కోట్లుగా తేల్చారు. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. ఆయన వృత్తి రీత్యా డాక్టర్. భార్య శ్రీరత్న కోనేరు. పెమ్మసాని చంద్రశేఖర్ తన పేరు మీద ఉన్న ఆస్తుల విలువ రూ. 2,316 కోట్లు కాగా భార్య చరాస్తుల విలువ రూ. 2,289 కోట్లుగా పేర్కొన్నారు అఫిడవిట్ లో.
అయితే అప్పులు రూ. 519 కోట్లు ఉన్నాయని తెలిపారు. చేతిలో ప్రస్తుతం తన వద్ద రూ. 2,06,400 ఉన్నాయని పేర్కొన్నారు.