ఈ రేవంతుడు హనుమంతుడు
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారు. భారీ ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం హనుమాన్ జయంతి సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాను కూడా హనుమంతుడి లాంటి వాడినని, తనకు ముందు నుంచీ భక్తి అన్నా, హిందూ ధర్మం అన్నా నమ్మకమని పేర్కొన్నారు. విలువలకు కట్టుబడి పైకి వచ్చిన వాడినని, కష్టం గురించి తనకు బాగా తెలునన్నారు. ఆనాడు శ్రీరాముడికి హనుమంతుడు నమ్మకమైన బంటుగా ఉన్నాడని తెలిపారు.
ఇవాళ తెలంగాణ యావత్ నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి తాను హనుమంతుడిగా విశిష్టమైన రీతిలో సేవలందిస్తానని స్పష్టం చేశారు. ఆరు నూరైనా సరే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు సీఎం.
ఇచ్చిన మాట నిలబెట్టు కోవడంలో ఆంజనేయుడు మొదటి వరుసలో ఉంటాడని, తనకు హనుమంతుడే ఆదర్శ ప్రాయుడైన దేవుడని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.