రాజస్థాన్ కు ‘రాయల్స్’ అభివందనం
మైదానంలో అభిమానులకు థ్యాంక్స్
జైపూర్ – రాజస్థాన్ రాయల్స్ జట్టు సంచలనంగా మారింది. ఆ జట్టు యాజమాన్యం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్క ఆటగాడికి స్వేచ్ఛతో పాటు సపోర్ట్ కూడా ఇస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో ఈసారి జరుగుతున్న ఐపీఎల్ 2024లో అద్బుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి విస్తు పోయేలా చేస్తోంది.
ప్రధానంగా శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర మార్గదర్శకత్వంలో, స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ విజయాలు సాధిస్తూ దూసుకు పోతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు ఖరారు చేసుకుంది.
తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక పోరులో రాజస్థాన్ దుమ్ము రేపింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. తమకు ముందు నుంచీ వెన్ను దన్నుగా ఉంటూ వచ్చిన , మద్దతు పలుకుతున్న తమ ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలియ చేసింది రాజస్థాన్ టీం.
మైదానం అంతటా కలియ తిరుగుతూ అభివాదం చేశారు రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. తమకు సామాజిక బాధ్యత కూడా ఉందని రాజస్థాన్ యాజమాన్యం ప్రకటించింది. ఒక మ్యాచ్ ను ఏకంగా మహిళల కోసం కేటాయించింది. అమ్మిన టికెట్ల లోంచి వారి అభివృద్దికి కేటాయించనున్నట్లు ప్రకటించింది.
మొత్తంగా హ్యాట్సాఫ్ కుమార , శాంసన్ టీంకు..మేనేజ్ మెంట్ కు.