NEWSNATIONAL

సుస్థిర పాల‌న బీజేపీతోనే సాధ్యం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాని మోదీ
మాధోపూర్ – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మిని ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం మాధోపూర్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

ఒక‌వేళ కాంగ్రెస్ కూట‌మి గ‌నుక ప‌వ‌ర్ లోకి వ‌స్తే 80 శాతం ఉన్న హిందువుల‌కు చెందిన ఆస్తుల‌ను కేవ‌లం 20 శాతం ఉన్న ముస్లింల‌కు పంచుతుందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖ‌ర్గే సీరియ‌స్ అయ్యారు.

తాము ఎక్క‌డ అలా అన్నామో చెప్పాలని, చ‌ర్చ‌కు తాము సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై దాట వేశారు పీఎం. దేశంలోని 143 కోట్ల మంది భార‌తీయులు గంప గుత్త‌గా సుస్థిర‌మైన పాల‌న‌ను కోరుకుంటున్నార‌ని, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడు నా లాంటి వాడు కావాల‌ని బ‌లంగా విశ్వసిస్తున్నార‌ని చెప్పారు.

ఇవాళ ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ క‌లిగి ఉన్న దేశంగా భార‌త దేశం పురోగ‌మిస్తోంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.