SPORTS

అజేయ శ‌త‌కం అద్భుత విజ‌యం

Share it with your family & friends

చెన్నై వేదిక‌గా సీఎస్కేకు ఓట‌మి

చెన్నై – ఐపీఎల్ 2024 అచ్చొచ్చిన‌ట్టుగా లేదు మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్. చెన్నై లోని చెపాక్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ పోరులో కేఎల్ రాహుల్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అద్బుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. 6 వికెట్ల తేడాతో సీఎస్కేను ఓడించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ న‌మోదు చేసింది. ఇక ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో మైదానంలోకి దిగిన ల‌క్నో ఏ మాత్రం త‌డ‌బాటుకు లోను కాలేదు. ప్ర‌ధానంగా మార్క‌స్ స్టోయినిస్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. అజేయంగా శ‌త‌కం చేసి త‌న జ‌ట్టుకు గెలుపు అందించాడు.

స్టోయినిస్ కు తోడు రుతురాజ్ గైక్వాడ్ తోడు కావ‌డంతో ల‌క్నో విజ‌యం సాధించింది సుల‌భంగా. విచిత్రం ఏమిటంటే ఇద్ద‌రూ సెంచ‌రీలు సాదించ‌డం . స్టోయినిస్ 65 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో 124 ర‌న్స్ చేశాడు. ఇక రుతురాజ్ తానేమీ తీసిపోనంటూ రెచ్చి పోయాడు. 60 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 3 సిక్స‌ర్లతో 108 ర‌న్స్ చేశారు.

అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 210 ప‌రుగులు చేసింది. శివ‌మ్ దూబే శివ‌మెత్తాడు. కేవ‌లం 27 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 66 ర‌న్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 7 సిక్స‌ర్లు ఉన్నాయి.