ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కు షాక్
విజయవాడ ఎస్పీపై కూడా
అమరావతి – ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఊహించని షాక్ తగిలింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పి. సీతారామాంజనేయులుపై వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు ఏపీ సర్కార్ అధికార దుర్వినయోగానికి పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేశారు.
ఇదే సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ పై వేటు వేసింది ఎన్నికల సంఘం. ఆయనతో పాటు విజయవాడ సీపీ కాంతి రాణా టాటాలను బదిలీ చేస్తూ ఈసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఏక కాలంలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు సీరియస్ కామెంట్స్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
సీపీ సీతారామాంజనేయులుతో పాటు కాంతి రాణా టాటాలకు ప్రభుత్వం ఎలాంటి పనులు అప్పగించ రాదని స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఈసీఐ.