శివ బాలకృష్ణ కేసులో ముగ్గురు అరెస్ట్
అదుపులోకి తీసుకున్న ఏసీబీ
హైదరాబాద్ – తెలంగాణలో సంచలనం సృష్టించింది హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు. వందల కోట్ల విలువ చేసే భూములు, భవనాలు, నోట్ల కట్టలు, ఆభరణాలు ఇలా చెప్పుకుంటూ పోతే భారీ ఎత్తున పోగేశాడు మనోడు. చేతులు తడపందే పని చేయనంటూ ఖరా ఖండిగా చెప్పేశాడు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పాడు. మాజీ మంత్రి కేటీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా శివ బాలకృష్ణ కేసులో పురోగతి సాధించింది. ముగ్గురు నిందితులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అంచనాలకు మించి ఆస్తులు పోగేసినట్లు గుర్తించారు. ఏక కాలంలో దాడులు చేపట్టారు. భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఆయనకు ప్రైవేట్ గా సహకరించిన గోదావరి సత్య నారాయణ మూర్తి, పెంట భరత్ కుమార్ , పెంట భరణి కుమార్ లను తెలంగాణ అవినీతి నిరోధక అరెస్ట్ చేసింది.
వీరి ముగ్గురిపై పెద్ద ఎత్తున ఆస్తులు నమోదు చేసినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా శివ బాలకృష్ణ తన బంధువులు, సన్నిహితులతో సమా పలువురి పేర్లతో రిజిష్టర్ అయిన భూములు, ప్లాట్లు, ఫ్లాట్స్ , వ్యవసాయ పొలాలు, ఆభరణాలు కూడబెట్టారు.