NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తులు రూ.163 కోట్లు

Share it with your family & friends

191 శాతం పెరిగిన ఆస్తులు

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన కూట‌మి త‌ర‌పున బ‌రిలో నిలిచారు. ఆయ‌న త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్ ను స‌మ‌ర్పించారు. త‌న‌కు రూ. 163 కోట్ల ఆస్తులు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు. విచిత్రం ఏమిటంటే గతంలో 2019 నుంచి 2024 వ‌ర‌కు చూసుకుంటే ఏకంగా 191 శాతం పెర‌గ‌డం విశేషం.

త‌నతో పాటు భార్య , ఇత‌రుల‌కు క‌లిపి రూ. 163 కోట్లు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. 2019లో త‌న ఆస్తులు రూ. 56 కోట్లు ఉన్న‌ట్లు తెలిపారు. నెల్లూరు లోని ఓ బ‌డిలో 10 దాకా చ‌దువుకున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. 2018 -2019లో రూ. 1.1 కోట్ల న‌ష్టం వ‌చ్చిన‌ట్టు పేర్కొన్నారు. 2022-2023 లో రూ. 12.2 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్టు స్ప‌ష్టం చేశారు .

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రూ. 46 కోట్ల చ‌రాస్తులు ఉన్నాయి. భార్య అన్నా పై కోటి, త‌న‌పై ఆధార‌ప‌డిన వారిపై రూ. 3.5 కోట్లు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇందులో చాలా వ‌ర‌కు డిపాజిట్లు, రూ. 14 కోట్ల విలువైన కార్లు, బైకులు ఉన్నాయని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. జన్వాడ, మంగ‌ళ‌గిరి, జూబ్లీ హిల్స్ లో రూ. 118 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేసినందుకు ఆయ‌న‌పై 8 క్రిమిన‌ల్ కేసులు న‌మోద‌య్యాయి.