దేవుళ్ల మీద ఒట్లు కేసీఆర్ మీద తిట్లు
నిప్పులు చెరిగిన మాజీ సీఎం
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సుదీర్ఘ కాలం తర్వాత ఓ ఛానల్ తో ముఖాముఖి నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం తనను మాత్రమే తిట్టేందుకు మాత్రమే ఉన్నట్టు అనిపిస్తోందన్నారు.
దేవుళ్ల మీద ఒట్లు వేయడం, తనను తిట్టడమే సీఎంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు కేసీఆర్. మద్యం కుంభకోణం అన్నది బక్వాస్ అని పేర్కొన్నారు. రాజకీయాలలో ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆయన పలు ప్రశ్నలకు క్లియర్ కట్ గా సమాధానాలు ఇచ్చారు కేసీఆర్. కావాలని తన కూతురును ఇరికించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పతనం తప్పదన్నారు. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణ పై మోదీ ఫోకస్ పెట్ట బోతున్నారంటూ పేర్కొన్నారు.
ఇక పార్టీ పేరు మార్చడం జరగదని స్పష్టం చేశారు కేసీఆర్. కేంద్ర ఎన్నికల సంఘం మార్చడాన్ని ఒప్పుకోదన్నారు. తాము ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్లమని, కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్ల పాటు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు .