ఏపీలో మళ్లీ మాదే అధికారం
స్పష్టం చేసిన వైఎస్ జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరంగా ఏర్పాటు చేసిన సోషల్ మీడియా విభాగం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆరు నూరైనా సరే తిరిగి తామే పవర్ లోకి వస్తామన్నారు సీఎం. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
వై నాట్ 175 అనేది తమ నినాదమని స్పష్టం చేశారు. 25 లోక్ సభ స్థానాలకు గాను 20కి పైగా సీట్లు రాబోతున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , పురందేశ్వరి లకు అంత సీన్ లేదన్నారు.
అబద్దాలు చెప్పడంలో , మోసం చేయడంలో చంద్రబాబును మించిన నేత లేడన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇక సోషల్ మీడియాలో ఎవరైనా వేధింపులకి గురవుతుంటే.. సైబర్ క్రైమ్ తరహాలో ఫిర్యాదు చేయడానికి పార్టీ పరంగా ఓ యాప్‌ను తయారు చేయమని సూచించానని చెప్పారు సీఎం.
ఆ ఫిర్యాదులపై వీక్లీ రిపోర్ట్ తెప్పించు కోవడం ద్వారా తాను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో లేదా భౌతికంగా వారు మనపై దాడి చేస్తున్నారంటే.. విజయానికి మనం చేరువగా ఉన్నామని అర్థం చేసుకోవాలన్నారు జగన్ మోహన్ రెడ్డి.