10 సీట్లు వస్తే కేసీఆర్ శాసిస్తారు
స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఈ సమయంలో ప్రజలు తిరిగి గులాబీ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. దీనిపై ఫుల్ ఫోకస్ పెడితే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో 17 సీట్లకు గాను బీఆర్ఎస్ గనుక 10 నుంచి లేదా 12 సీట్లు కైవసం చేసుకుంటే ఇక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ శాసిస్తుందని, కేసీఆర్ ముప్పు తిప్పలు పెట్టడం ఖాయమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో గారడీలు చేస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్ , బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. దేశంలో మోదీకి వ్యతిరేకంగా గాలి వీస్తోందన్నారు కేటీఆర్. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.