కడియం చాప్టర్ క్లోజ్ – కేసీఆర్
స్పష్టం చేసిన మాజీ సీఎం
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. పార్టీని విడిచి వెళ్లి పోయిన మాజీ డిప్యూటీ సీఎం , స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాపమని ఆయనను చేరదీసి పదవి కట్టబెట్టానని, పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చానని తీరా పవర్ పోయాక జంప్ కావడం దారుణమన్నారు. జనం అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే కడియం శ్రీహరి పార్టీని వీడి తప్పు పని చేశారని అన్నారు. ఎందుకంటే ఎప్పుడు మోసం చేస్తారో తెలియని కాంగ్రెస్ పార్టీలో చేరడం విడ్డూరంగా ఉందన్నారు కేసీఆర్. ఏది ఏమైనా కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి రాబోతోందన్నారు.
ఆయన రాజకీయ జీవితం క్లోజ్ కాక తప్పదన్నారు. జనం బండ కేసి కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. తమ పార్టీ గుర్తు మీద గెలిచిన కడియం శ్రీహరి ఎలా ఇతర పార్టీలోకి వెళతారని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమని, తాను రాష్ట్రాన్ని శాసిస్తానని పేర్కొన్నారు కేసీఆర్.