NEWSTELANGANA

రాజ్యాంగాన్ని మార్చితే యుద్ద‌మే

Share it with your family & friends

మోదీని హెచ్చ‌రించిన ఆర్ఎస్పీ

జోగులాంబ గ‌ద్వాల జిల్లా – ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. మ‌రోసారి గనుక హిందూ ఫాసిస్టు పార్టీగా ముద్ర ప‌డిన భార‌తీయ జ‌న‌తా పార్టీ గ‌నుక అధికారంలోకి వ‌స్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తార‌ని హెచ్చ‌రించారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున నాగ‌ర్ క‌ర్నూల్ లోక్ స‌భ స్థానం నుంచి బ‌రిలో ఉన్నారు. విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఆలంపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇలా ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో గార‌డీలు చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌లు ఎందుకు గెలిపించామా అని ఆందోళ‌న చెందుతున్నార‌ని చెప్పారు.

ఇక త‌నను గెలిపిస్తే ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా వాయిస్ ను పార్ల‌మెంట్ లో వినిపిస్తాన‌ని అన్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.