NEWSNATIONAL

ధృవ్ రాథీ సెన్సేష‌న్

Share it with your family & friends

కొత్త వీడియో రికార్డ్ బ్రేక్

న్యూఢిల్లీ – ధృవ్ రాథీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌స్తుతం భార‌త దేశానికి సంబంధించి మోస్ట్ పాపుల‌ర్ యూట్యూబ‌ర్. త‌ను ఒక్క‌డే ప్ర‌ధాన మంత్రి మోదీని, ఆయ‌న ప‌రివారాన్ని, భార‌తీయ జ‌న‌తా పార్టీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను తూర్పార బ‌డుతున్నారు.

తాజాగా వాట్సాప్ యూనివ‌ర్శిటీ ద్వారా మోదీ చెప్పే అబ‌ద్దాల‌ను బీజేపీ ఐటీ విభాగం ఎలా వక్రీక‌రించి షేర్ చేస్తోందో కుండ బద్ద‌లు కొట్టాడు. ఈ వీడియో కేవ‌లం 3 గంట‌ల్లో 2 మిలియ‌న్ వ్యూస్ ను దాటింది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

దేశ వ్యాప్తంగా పేరు పొందిన జ‌ర్న‌లిస్టులను దాటేశాడు. రోజు రోజుకు ధృవ్ రాథీకి జ‌నం నుంచి ఆద‌ర‌ణ పెరుగుతోంది. కార‌ణం మ‌తం పేరుతో, కులం పేరుతో రాజ‌కీయాలు చేస్తూ కేవ‌లం ఓట్ల‌ను దండు కోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న బీజేపీకి కోలుకోలేని దెబ్బ త‌గులుతోంది.

తాజాగా తొలి విడ‌తలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఉత్త‌రాదిన పెద్ద ఎత్తున బీజేపీ దాని అనుబంధ పార్టీలు సీట్ల‌ను కోల్పోనున్న‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా ధృవ్ రాథీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న మోదీ బండారాన్ని బ‌ట్ట బ‌య‌లు చేస్తున్న తీరు కోట్లాది మందికి స్సూర్తిని క‌లిగిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.