తెలంగాణ నుంచి వేరు చేయలేరు
స్పష్టం చేసిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు , మాజీ సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ఆనవాళ్లు తీసేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నాడని , తన తరం కాదన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అని , తెలుసుకుంటే మంచిదన్నారు. వ్యవస్థలను అర్థం చేసుకోకుండా, వనరులను గుర్తించకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
ఎన్నో రాత్రుళ్లు మేల్కొని తెలంగాణ పునర్ నిర్మాణం కోసం కృషి చేశానని చెప్పారు కేసీఆర్. కాంగ్రెసోళ్లకు సోయి లేకుండా పోయిందన్నారు. వాళ్లకు తాము చేసిన అభివృద్ది గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు . ఎవరు డెవలప్ చేశారో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని పదే పదే అంటున్నాడని, ఆయనకు అంత సీన్ లేదన్నారు. ఒకవేళ తీసేయాలంటే తాను కట్టిన సచివాలయం, ఎమ్మెల్యే క్వార్టర్లు, జిల్లా కలెక్టరేట్లను కూడా కూల్చేస్తాడా అంత దమ్ముందా సీఎంకు అంటూ నిప్పులు చెరిగారు కేసీఆర్.