మంగళ సూత్రం విలువ తెలుసా
నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ – దేశంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. మోదీ వర్సెస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్న రీతిలో ఎవరికి వారే ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టిస్తున్నారు.
ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై అనుచిత కామెంట్స్ చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. తాము అధికారంలోకి వస్తే హిందూ మహిళల మంగళ సూత్రాలను తాము గుంజుకుంటామని ఎలా అంటారని ప్రశ్నించారు.
మోదీకి మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో దీన్ని బట్టి చూస్తే తెలుస్తందన్నారు. అసలు మంగళ సూత్రానికి ఉన్న విలువ ఏమిటో నీకు తెలుసా అంటూ నిప్పులు చెరిగారు ప్రియాంక గాంధీ. తమ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. ఇది చరిత్ర చెరపలేని సత్యమని , మరి మోదీ పరివారం ఎలాంటి త్యాగాలు చేశారో దేశానికి చెప్పాలన్నారు ప్రియాంక గాంధీ.