బ్రహ్మరథం అభిమానసంధ్రం
పోటెత్తిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
పిఠాపురం – జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలనంగా మారారు. పిఠాపురం జనసేన , టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు సోదరుడు కొణిదెల నాగబాబు కూడా ఉన్నారు. అంతకు ముందు కిలోమీటర్ల పొడవునా జనం పోగయ్యారు. ఎక్కడ చూసినా ఫ్యాన్స్ తో హోరెత్తించారు.
పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది తరలి వచ్చారు. నామినేషన్ సందర్బంగా లక్ష మందికి పైగా పాల్గొన్నారని జనసేన పార్టీ పేర్కొంది. ఇది శాంపిల్ మాత్రమేనని ముందుంది ముసళ్ల పండుగ అని పేర్కొన్నారు.
ఆరు నూరైనా సరే , ఏపీ సీఎం జగన్ రెడ్డి, వైసీపీ పరివారం ఎన్ని కుట్రలు పన్నినా , ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా జనసేనాని గెలుపును అడ్డుకోరంటూ స్పష్టం చేసింది జనసేన పార్టీ. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు అవినీతి, అధర్మానికి నీతికి, నిజాయితీకి మధ్య జరుగుతున్న యుద్దంగా అభివర్ణించింది పార్టీ.