కాకినాడలో కూటమిదే విజయం
స్పష్టం చేసిన జనసేనాని పవన్
కాకినాడ – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఈసారి తమ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. బుధవారం తమ కూటమి తరపున కాకినాడ లోక్ సభ స్థానం నుంచి బరిలో ఉన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్బంగా భారీ ఎత్తున టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు , అభిమానులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎక్కడ చూసినా జనంతో రోడ్లన్నీ క్రిక్కిరిసి పోయాయి. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తల మీదకు వచ్చేలా చేసింది.
నామినేషన్ ను పురస్కరించుకుని భారీ ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా వాహనాలతో నిండి పోయింది. ఈ సందర్బంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు జనసేనాని పవన్ కళ్యాణ్. అభిమానుల హర్షధ్వానాలతో తట్టుకోలేక పోయారు. సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు . ఆయన కూడా వారితో కలిసి డ్యాన్సు చేశారు. వారిని ఉత్సాహ పరిచేందుకు ప్రయత్నం చేశారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. కాకినాడలో కూటమిదే జెండా ఎగురుతుందన్నారు. ఇక జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు.