SPORTS

ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

Share it with your family & friends

గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్

న్యూఢిల్లీ – ఐపీఎల్ 2024లో భాగంగా న్యూఢిల్లీ మైదానంలో జ‌రిగిన కీల‌క పోరు ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌ర‌కు పంత్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ విక్ట‌రీ సాధించింది. 224 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో చివ‌రి బంతి దాకా పోరాడింది.

కేవ‌లం 43 బంతుల్లో 86 ర‌న్స్ చేశాడు. 5 ఫోర్లు 8 సిక్స‌ర్లు ఉన్నాయి. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. మొత్తంగా పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. సొంత ఇలాఖాలో సత్తా చాటాడు. పంత్ కు తోడుగా అక్ష‌ర్ ప‌టేల్ కూడా విజృంబించాడు.

ఇక గుజ‌రాత్ విష‌యానికి వ‌స్తే సుద‌ర్శ‌న్, మిల్ల‌ర్ చేసిన పోరాటం ఫ‌లించ లేదు. ఢిల్లీ జ‌ట్టులో ఈ ఇద్ద‌రూ వ‌ణుకు పుట్టించారు. మిల్ల‌ర్ కిల్ల‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. చివ‌ర‌లో ఆఫ్గాన్ స్టార్ ర‌షీద్ ఖాన్ ప్ర‌య‌త్నం చేసినా 4 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. దీంతో ఎట్ట‌కేల‌కు ఊపిరి పీల్చుకుంది ఢిల్లీ క్యాపిట‌ల్స్.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 224 ర‌న్స్ చేసింది. ప‌టేల్ 43 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 66 ర‌న్స్ చేశాడు. గుజ‌రాత్ జ‌ట్టులో మిల్ల‌ర్ 23 బాల్స్ ఎదుర్కొని 55 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 3 సిక్స‌ర్లు ఉన్నాయి. సుద‌ర్శ‌న్ 39 బంతుల్లో 65 ప‌రుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి.