రైల్వే స్టేషన్ లో రూ. 20కే భోజనం
విజయవాడలో ఎండా కాలం వరకు
బెజవాడ – సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు తీపి కబురు చెప్పింది. కేవలం రూ. 20 లకే భోజన సౌకర్యం ఏర్పాటు చేసింది. ఈ సౌకర్యం విజయవాడ లోని రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది ఐఆర్టీసీ.
ఇందుకు గాను రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. జనరల్ బోగీ నిలిచే చోట దీనిని ఏర్పాటు చేశారు . వేసవి కాలం పూర్తయ్యేంత వరకు ఈ సదుపాయం ఉంటుందని స్పష్టం చేశారు రైల్వే అధికారులు.
వేసవి సందర్బంగా ప్రత్యేక రైళ్లతో పాటు ఇతర రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఎకానమీ మీల్స్ పేరుతో రూ. 20 కే నాణ్యమైన భోజనం అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు రూ. 50లకే స్నాక్ మీల్స్ అందిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలని ఐఆర్టీసీతో కలిసి ఈ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఈ కౌంటర్లను ప్రయోగాత్మకంగా విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు డీఆర్ఎం నరేంద్ర ఆనంద రావు పాటిల్ వెల్లడించారు.