శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.66 కోట్లు
దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,080
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రోజు రోజుకు దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను బుధవారం 64 వేల 80 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
25 వేల 773 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, ఆభరణాలు రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.66 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతానికి శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్ మెంట్ ల లో వేచి ఉన్నారని , ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా భక్తులకు ఎప్పటికప్పుడు సహాయ పడేందుకు శ్రీవారి భక్తులు ప్రయత్నం చేస్తున్నారని , టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిందని పేర్కొన్నారు .