పని చేయని మోదీ మంత్రం
ప్రధానమంత్రిపై కాంగ్రెస్ సెటైర్
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా మోదీ చరిష్మా పని చేయడం లేదని, భారతీయ జనతా పార్టీకి ఎదురు గాలి తప్పదని జోష్యం చెప్పింది కాంగ్రెస్ పార్టీ. గురువారం ఆ పార్టీ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. తొలి విడతగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ దళానికి కోలుకోలేని షాక్ తగలనుందని పేర్కొంది. ఎంత కాలం అబద్దాలను , కులాన్ని, మతాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తారంటూ ప్రశ్నించింది.
తమ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు అద్భుతమైన ఆదరణ లభించిందని పార్టీ తెలిపింది. ఈ దేశాన్ని ఆర్థిక రంగంలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన ఘనత మాజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని స్పష్టం చేసింది.
ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మోదీని జనం నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు ముస్లింలకు దారదత్తం చేస్తామని చెప్పిన ఆయన మాటలు శుద్ద అబద్దమని తెలుసుకున్నారని తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ఎవరిది వారసత్వపు రాజకీయమో తనకే తెలియాలంటూ మోదీపై మండిపడింది.