వివేకా హంతకులకు మద్దతిస్తే ఎలా
సీఎం జగన్ కు వైఎస్ సౌభాగ్యమ్మ లేఖ
కడప జిల్లా – దివంగత , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో గురువారం లేఖ రాయడం కలకలం రేపింది.
ఈ సందర్బంగా సంచలన ఆరోపణలు చేశారు. సీఎంగా ఉంటూ ఎందుకు హంతకులకు మద్దతు ఇస్తున్నావంటూ ప్రశ్నించారు. 2009 లో నువ్వు మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో తాము కూడా అంతకంటే ఎక్కువగా బాధకు గురైనట్లు పేర్కొన్నారు.
నీ చెల్లెలు సునీతా రెడ్డి కూడా అంతకంటే ఎక్కువగా మనో వేదనను అనుభవించిందని వాపోయారు సౌభాగ్యమ్మ. ఆనాటి నుంచి నేటి దాకా జరిగిన పరిణామాలు తమను ఎక్కువగా ఆందోళనకు గురి చేశాయని తెలిపారు.
విచిత్రం ఏమిటంటే మన కుటుంబానికి చెందిన వారే ఈ దారుణ హత్యలో కీలకంగా ఉండడం దారుణమన్నారు సౌభాగ్యమ్మ. అంతే కాదు హత్యకు పాల్పడిన వారికి నువ్వు మద్దతు పలకడం విస్తు పోయేలా చేసిందని వాపోయారు.
నిన్ను సీఎంగా చూడాలని జీవిత కాలమంతా పరితపించిన చిన్నానను చంపించడం నీకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. న్యాయం కోసం ధర్మ పోరాటం చేస్తున్న చెల్లెళ్ల గురించి దుష్ప్రచారం చేయడం సబబు కాదని పేర్కొన్నారు.