భారత కూటమికి ఓటమి తప్పదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మధ్యప్రదేశ్ – ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమిపై నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మరోసారి పవర్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ.
ఆరు నూరైనా సరే దేశంలో కాషాయపు గాలిని తట్టు కోవడం కష్టమన్నారు. 75 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తన కాలంలో ఏం చేసిందంటూ ప్రశ్నించారు. కానీ తాము పవర్ లోకి వచ్చాక ఈ 10 ఏళ్ల కాలంలో దేశం అన్ని రంగాలలో ముందుకు వెళ్లిందన్నారు.
డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో ఇండియా పలు దేశాలను అధిగమించిందని పేర్కొన్నారు ప్రధాన మంత్రి. 545 ఎంపీ స్థానాలకు గాను తమ పార్టీకి కనీసం 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ.
దేశంలోని 143 కోట్ల మంది ప్రజలలో మొదటి ఛాయిస్ ఏమిటంటే భారతీయ జనతా పార్టీనేనని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. విపక్షాలతో కూడిన భారతీయ కూటమి పనై పోయిందన్నారు. వారిని ఏ ఒక్కరు కూడా నమ్మడం లేదన్నారు ప్రధానమంత్రి.