NEWSTELANGANA

మాట‌ల యుద్ధం స‌వాళ్ల ప‌ర్వం

Share it with your family & friends

సీఎం..కేటీఆర్..హ‌రీశ్..ఆలేటి

హైద‌రాబాద్ – రాష్ట్రంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ ప‌రంగా వేడి రాజుకుంది. ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు మాట‌ల యుద్దానికి తెర లేపారు. నువ్వా నేనా అంటూ ఒక‌రిపై మ‌రొక‌రు స‌వాళ్ల‌తో హోరెత్తిస్తున్నారు.

ఆరు గ్యారెంటీలు కావ‌వి గార‌డీలంటూ బీఆర్ఎస్ మండి ప‌డుతోంది. ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు, మాజీ మంత్రులు కేటీఆర్, త‌న్నీరు హ‌రీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌తిరోజూ సీఎం రేవంత్ రెడ్డిని, ఆయ‌న మంత్రి వ‌ర్గాన్ని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నారు. వీరికి తోడు మాజీ సీఎం కేసీఆర్ సైతం సీరియ‌స్ కామెంట్స్ చేశారు. అంతే కాదు సోయి లేనోళ్లంటూ పేర్కొన్నారు.

ద‌మ్ముంటే తాము చేసిన అవినీతి ఏమిటో బ‌య‌ట పెట్టాల‌ని కూడా గులాబీ నేత‌లు బ‌హిరంగంగా స‌వాళ్లు విసిరారు. ఇదిలా ఉండ‌గా కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని కేసీఆర్ కు స‌వాల్ విసిరారు రేవంత్ రెడ్డి. తాగు నీటిపై చ‌ర్చ‌కు రావాల‌ని కేటీఆర్ కు బ‌హిరంగ స‌వాల్ విసిరారు సీఎం.

మ‌రో వైపు పంధ్రాగ‌స్టు లోపు రైతులంద‌రికీ పంట రుణాలు రూ. 2 ల‌క్ష‌లు మాఫీ చేస్తే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు హ‌రీశ్ రావు. ఇక బీఆర్ఎస్ గ‌నుక 17 ఎంపీ సీట్ల‌లో 8 సీట్లు గెలిస్తే త‌న మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను లై డిటెక్ట‌ర్ టెస్టుకు సిద్ద‌మేన‌ని అయితే సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిలు సిద్దం కావాల‌ని స‌వాల్ విసిరారు కేటీఆర్. ఇక తెలంగాణ‌లో 14 సీట్లు గ‌నుక కాంగ్రెస్ గెలిస్తే ఏకంగా తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని బహిరంగ ప్ర‌క‌ట‌న చేశారు బీజేపీ ఎల్పీ , ఎమ్మెల్యే ఆలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి.

ఇక దుబ్బాక‌కు ఎన్ని నిధులు తీసుకు వ‌చ్చారో చెప్పాల‌ని ర‌ఘునంద‌న్ కు స‌వాల్ విసిరారు సీఎం. తాను తీసుకు వ‌చ్చిన నిధులు, చేప‌ట్టిన ప‌నుల‌తో ఓ బుక్ లెట్ రిలీజ్ చేశారు మాజీ ఎమ్మెల్యే. మొత్తంగా స‌వాళ్ల ప‌ర్వం రంజుగా మారింది.

మెదక్ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్‌రావు దుబ్బాకకు ఎన్ని నిధులు, ప్రాజెక్టులు తీసుకొచ్చారో బయటపెట్టాలని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. రఘునందన్ రావు దానిని అంగీకరించి బుక్‌లెట్‌ను విడుదల చేసి చర్చకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు

లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు అయినా గెలవాలని కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. మల్కాజిగిరి సీటులో తనపై పోటీ చేయాలని రేవంత్ రెడ్డిని కోరారు