డీసీసీ అధ్య‌క్షుల ఎంపిక‌కు ప‌రిశీల‌కులు

హైద‌రాబాద్ : ఏఐసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణలో 3 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికకు TPCC పరిశీలకులకు AICC ఆమోదం తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్, మాజీ ఎంపీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు లేఖ ద్వారా ఈ వివరాలను తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు ( 9696619999), ఎం.డి. రియాజ్( 9849022931), నెరెల్ల శారద ( 9866047777)ను ఎంపిక చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక కోసం టేల్ రమేష్ రెడ్డి ( 9848180201), ఈ.వి. శ్రీనివాస్ ( 9849379700) డా. రాగమయి, ఎమ్మెల్యే ( 9885259639)ను ఎంపిక చేసింది ఏఐసీసీ.

ఇక రామగుండం కార్పొరేషన్ (సిటీ DCC) అధ్య‌క్షుడి ఎంపిక కోసం ఎం.ఏ. ఫయీమ్ (సంగారెడ్డి) (7997996655), బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ( 9440334455), రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ( 851999171)ల‌ను ఎంపిక చేసింది. ఈ పరిశీలకులు ఆయా జిల్లాలకు సంబంధించిన AICC పరిశీలకులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్.

  • Related Posts

    కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం

    అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం…

    హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్

    హైద‌రాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వ‌హించాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *