బీజేపీ నేత‌లు చ‌రిత్ర తెలియ‌ని జోక‌ర్లు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయ‌న ప్ర‌ధాని మోదీ, ఆయ‌న ప‌రివారాన్ని ఏకి పారేశారు. ఇదే క్ర‌మంలో బీజేపీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను , నాయ‌కుల‌ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. మన చరిత్ర, తత్వశాస్త్రం గురించి ఏమీ తెలియని జోకర్లకు, విదూషకులకు భారతదేశం భయపడ కూడద‌న్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడుతున్నప్పుడు భయం కలగడం సహజమే కావచ్చు, కానీ ఈ రోజు మన చరిత్ర, తత్వశాస్త్రం గురించి ఏమీ తెలియని శక్తులకు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

దేశం విభజనకు లొంగకుండా ధైర్యంగా నిలబడాలని ఆయన స్పష్టం చేశారు .ధైర్యంగా నిలబడాలని ఆయన నొక్కి చెప్పారు. భార‌త రాజ్యాంగ స్పూర్తికి భంగం క‌లిగిస్తూ అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తున్న వారిని దేశం , ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని అన్నారు రాహుల్ గాంధీ. గ‌త 2014 నుంచి నేటి దాకా దేశంలో ఏ ఒక్క వ్య‌వ‌స్థ‌ను స‌రిగా ప‌ని చేయ‌నివ్వ‌డం లేద‌న్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు రాహుల్ గాంధీ. ప్ర‌జ‌లంతా అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, అందుకే జెన్ జి ఉద్య‌మం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్నారు. ఇక‌నైనా మోదీ, షా మారాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోక త‌ప్ప‌ద‌న్నారు.

  • Related Posts

    కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం

    అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం…

    హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్

    హైద‌రాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వ‌హించాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *