మోదీని ఆదర్శంగా తీసుకున్నాం
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలు
మంగళగిరి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నరేంద్ర మోదీ గుజరాత్ లో అద్బుతంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అమలు చేశారన్నారు.
దానిని మోడల్ గా ఏపీలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. ఇక్కడ ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయని స్పష్టం చేశారు నారా లోకేష్.
విచిత్రం ఏమిటంటే ఇదే స్కీంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ నిరాధారమైన ఆరోపణలు వైసీపీ నేతలు చేశారంటూ ఆరోపించారు. చివరకు ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా చంద్రబాబు నాయుడును ఇరికించారని, శాడిస్ట్ సీఎం జగన్ రెడ్డి తన తండ్రిని జైలుకు పంపించేలా చేశాడని అన్నారు.
కానీ ఎక్కడా నిరూపితం కాలేదన్న విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. మొత్తంగా జగన్ పనై పోయిందన్నారు. తమ కూటమి పవర్ లోకి వస్తుందని చెప్పారు నారా లోకేష్.