రైతులకు దిక్కేది – కేసీఆర్
పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
తెలంగాణ – మాయ మాటలతో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ హామీలను అమలు పర్చడంలో విఫలమైందని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్. బస్సు యాత్రలో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆరుగాలం పంటలు పండించే రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో శ్రద్ద చూపక పోవడం దారుణమన్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
15 ఏళ్ల కిందట ఎట్లుండే తెలంగాణ. తాను లేక పోతే , పోరాడి ఉండక పోతే స్వరాష్ట్రం వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు. కావాలని తనపై ఉన్న కోపంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు . నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించినందుకే తనపై కోపం పెంచుకున్నాడని ఆరోపించారు.
తాను ఉన్నంత వరకు సీఎం ఆటలు సాగవన్నారు. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని అన్నారు. తనకు ఉద్యమించడం, పోరాడడం, ఆందోళనలు చేపట్టడం కొత్త కాదన్నారు. ఆరు గ్యారెంటీలు కావవి గారడీలంటూ మండిపడ్డారు కేసీఆర్.