NEWSNATIONAL

పాల్కీ శ‌ర్మ‌కు ప్ర‌ధాని ప్ర‌శంస‌

Share it with your family & friends

మీరు అద్భుత‌మైన జ‌ర్న‌లిస్ట్

న్యూఢిల్లీ – ఎవ‌రినైనా అభినందించాల‌న్నా, వారిని ప్రోత్స‌హించాల‌న్నా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌ర్వాత ఎవ‌రైనా. తాజాగా పీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఇండియాలో గ‌ర్వించ ద‌గిన మీడియా ప్రొఫెష‌నల్ గా పేరు పొందిన పాల్కీ శ‌ర్మ‌.

ప్ర‌ధాన మంత్రిగా కొలువు తీరిన త‌ర్వాత భార‌త దేశం గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌దైన శైలిలో ప్ర‌త్యేకంగా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తూ వ‌చ్చారు పాల్కీ శ‌ర్మ‌. అస‌లు ఇండియా అంటే ఏమిటి..? దాని వెనుక శ‌క్తి ఏమిటి..143 కోట్ల మంది భార‌తీయులు ఎలా స‌మ‌న్వ‌యంతో స‌హ జీవ‌నం చేస్తున్నారో కూలంకుశంగా వివ‌రిస్తూ చెప్పింది.

అంతే కాదు అనాది నుంచి వ‌స్తున్న భార‌తీయ సంస్కృతి, నాగ‌రిక‌తలోని గొప్ప‌ద‌నం గురించి ప్ర‌త్యేకంగా ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా వివ‌రించింది జ‌ర్న‌లిస్టు పాల్కీ శ‌ర్మ‌. దీంతో ఒక్క‌సారిగా ఆమె చేసిన ప్ర‌సంగం ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భార‌తీయుల‌ను, విదేశీయుల‌ను ప్ర‌భావితం చేసింది. అందులో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కూడా ఒక‌రు.

ఈ సంద‌ర్బంగా వైర‌ల్ గా మారిన పాల్కీ శ‌ర్మ వీడియో గురించి, ఆమె ప‌నితీరు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ప్ర‌ధాన‌మంత్రి. భార‌తీయుడిగా , పీఎంగా తాను గ‌ర్విస్తున్నాన‌ని పేర్కొన్నారు.