రేవంత్ తుపాకీ రాముడు
పిట్టల దొర లాగా మాట్లాడుతుండు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయనను ఓ తుపాకీ రాముడంటూ ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టికి దక్కుతుందన్నారు.
పవర్ లోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తానంటూ రైతులను మోసం చేశాడంటూ ఆరోపించారు. తను ఇచ్చిన మాటకు కట్టుబడని సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనకు పాలన చేత కాక తమపై రాళ్లు రువ్వితే ఎలా అని ప్రశ్నించారు కేటీఆర్.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని కొత్త రాగం అందుకున్నాడని, ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తానంటూ మరోసారి మోసం చేసేందుకు రెడీ అయ్యాడంటూ మండిపడ్డారు. జనం ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. దేవుళ్ల మీద ఓట్లు తప్ప ఆయన ఏమీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచిత్రం ఏమిటంటే దేవుళ్లు అడగరు కాబట్టి వారి మీద ఒట్టేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.