రేవంత్ దమ్ముంటే దా
సవాల్ విసిరిన హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. పంధ్రాగస్టు లోపు రైతులకు రుణాలు మాఫీ చేస్తానంటే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ ఆచరణలో అమలు చేయలేక పోతే తను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలని అన్నారు.
తాను అన్న మాట మేరకు నిలబడ్డానని, ఆ మేరకు తను ముందుగా చెప్పినట్టుగానే హైదరాబాద్ లోని అసెంబ్లీకి ఎదురుగా ఉన్న అమర వీరుల స్థూపం వద్దకు వచ్చానని , తన రాజీనామా పత్రాన్ని ముందుగానే మేధావులకు అందజేస్తున్నట్లు చెప్పారు.
శుక్రవారం తన్నీరు హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఇక సీఎం వంతు వచ్చిందని, తనకు దమ్ము, ధైర్యం ఉంటే మీడియా ముందుకు, ప్రజల వద్దకు రావాలని అన్నారు. అమర వీరుల స్థూపం వద్దకు ఏనాడైనా వచ్చాయా అని ప్రశ్నించారు తన్నీరు హరీశ్ రావు.
రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే
@BRSHarish
ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల హామీల అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో ప్రతి సవాల్ విసిరిన హరీష్ రావు